భీమ్లా నాయక్ కు అమెజాన్ కళ్లు చెదిరే ఆఫర్ ..

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో భీమ్లా నాయక్ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ స‌ర‌స‌న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ నటిస్తుంది. ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు..ఆ అంచనాలకు తగ్గట్లే సంక్రాంతి బరిలో గ్రాండ్ గా ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ క్రమంలో ఇక ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు 150 కోట్ల వరకు అమెజాన్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా సరే ఇలాంటి ఆఫర్ వస్తే మాత్రం ఓటీటీ లోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ భీమ్లా నాయక్ నిర్మాతలు మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ క్లైమాక్స్‌లో వచ్చే పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ గ్యాప్‌లో హీరోలిద్దరూ కెమెరాకు ఫోజ్‌ ఇచ్చారు. ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.