అల్లు అర్హ సినీ ఎంట్రీ !

‘శాకుంతలం ‘ చిత్రం లో యువరాజు భరతుడి పాత్ర

Allu Arha Cine Entry!
Star Hero Allu Arjun’s daughter Allu Arha

‘అల్లు’ ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఉనికిని చాటుకున్నారు. అల్లు రామలింగయ్య నిర్మించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ హీరో అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.  క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్ లో సమంత అక్కినేని లీడ్ రోల్ చేస్తూ‌ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంతో అల్లు అర్హ యాక్టింగ్ డెబ్యూ చేస్తోంది. ఈ మూవీలో బేబి ఆర్హ  యువరాజు భరతుడి పాత్రలో న‌టిస్తోంది. ఈరోజు గురువారం అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో అల్లు వారి పిల్లలు అయాన్ – అర్హ లకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అర్హ తన ముద్దు ముద్ద మాటలతో అల్లరి చేష్టలతో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియా మధ్యమాలలో ఎప్పటికప్పుడు అర్హకు సంబంధించి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. దీంతో నాలుగేళ్ల వయసులోనే తన క్యూట్ నెస్ తో అల్లు అర్హ పాపులారిటీ సంపాదించుకుంది. 

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/