సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఇంట విషాదం

నారాయణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూత

R Narayana Murthy
R Narayana Murthy

కాకినాడః ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె మృతి చెందారు. రెడ్డి చిట్టెమ్మకు ఏడుగురు సంతానం. వారిలో మూడో కుమారుడు ఆర్.నారాయణమూర్తి. ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/