ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభణ
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 85,78,052 కేసులు

న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. ప్రతి రోజు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూస్తే వైరస్ విజృంభన ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 85,78,052 మంది ఈ వైరస్‌బారిన పడ్డారు. వైరస్ వల్ల 4,56,284 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 45,30,261 మంది కోలుకోగా, మరో 35,91,507 మంది చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 22,63,651 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన 1,20,688 మంది మరణించారు. ఇంకా 12,11,969 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,30,994 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 9,83,359 పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 47,869 మంది మరణించగా, 5,20,360 మంది కోలుకున్నారు. మరో 4,15,130 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/