న‌వంబ‌ర్ 17న బ్రిక్స్ దేశాల సదస్సు

12th-brics-summit-to-be-held-on-november-17

న్యూఢిల్లీ: ర‌ష్యా చైర్మ‌న్ షిప్‌లో బ్రిక్స్‌దేశాల కూట‌మి న‌వంబ‌ర్ 17న స‌మావేశం కానున్న‌ది. ఈ 12వ బ్రిక్స్ స‌ద‌స్సులో భార‌త్‌తోపాటు బ్రిక్స్ కూట‌మికి చెందిన ఐదు దేశాల అధినేత‌లు పాల్గొన‌నున్నారు. బ్రిక్స్ పార్ట్‌న‌ర్‌షిప్ ఫ‌ర్ గ్లోబ‌ల్ స్టెబిలిటీ, షేర్‌డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్ అనేది ఈ స‌మావేశంలో బ్రిక్స్ దేశాధినేత‌ల థీమ్‌గా నిర్ణ‌యించారు. ఈ మేర‌కు భార‌త్‌లోని ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

కాగా, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో భార‌త ప్ర‌ధాని నరేంద్రమోడి, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌, బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సోనారో, సౌతాఫ్రికా అధ్య‌క్షుడు ర‌మాఫోసా పాల్గొన‌నున్నారు. అయితే, ల‌ఢ‌క్ స‌రిహ‌ద్దుల్లో భార‌త్‌, చైనా దేశాల‌ మ‌ధ్య వివాదం రాజుకున్న‌ త‌ర్వాత తొలిసారి ఆ రెండు దేశాల అధినేత‌లు వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ముఖాముఖి ఎదురుప‌డ‌నున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/