ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహణం

న్యూఢిల్లీ: ఐరోపా దేశమైన ఉత్తర మెసిడోనియా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బాల్కన్‌ కౌంటీలోని టెటోవో నగరంలో ఉన్న ఓ కరోనా దవాఖానలో మంటలు చెలరేగాయి. దీంతో పది మంది సజీవదహణమయ్యారు. పలువురు గాయపడ్డారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఈ తాత్కాలిక దవాఖానను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, క్షతగాత్రులతో పాటు మరికొందరు రోగులను ఇతర దవాఖానలకు తరలించామని అధికారులు వెల్లడించారు.

కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. అయితే, ఓ పేలుడు తర్వాత మంటలు సంభవించినట్లు ఆ దేశ ప్రధాని జొరాన్ జాయెవ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. ఆగస్టు నుంచి ఉత్తర మెసిడోనియాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 మంది బాధితులు మరణిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 6100 మంది మృతిచెందారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/