విశాఖ ఘటనపై స్పందించిన పలువురు క్రీడాకారులు

virat kohli
virat kohli

న్యూఢిల్లీ: విశాఖలో నిన్న జరిగిన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై పలువురు క్రీడా కారులు స్పందిస్తూ భాధిత కుటుంబాలకు సానుభుతి తెలిపారు. గ్యాస్‌ లీక్‌ ఘటనలో తమకు ఎంతో ఇష్టమైన వారి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. భాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు ట్వీట్‌ చేశాడు. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గ్యాస్‌ లీక్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభుతి తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేశారు. భారత పుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి విశాఖ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తు .. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు తనను తీరని మనో వేదనకు గురిచేశాయని అన్నారు. భాధితులు త్వరగా కోలుకోవాలనలి ఆకాంక్షించాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/