మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

హైదరాబాద్‌: పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఉద్యోగ సంఘాల నేత‌లు ఆయన క్యాంపు కార్యాలయం హన్మకొండలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం కలిశారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల‌తో ఉద్యోగులకు ప్ర‌మోష‌న్లు క‌ల్పించినందుకు మంత్రి ద‌యాక‌ర్‌రావుకు ఉద్యోగ సంఘాల నాయ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఉద్యోగుల‌కు మెరుగైన ఫిట్‌మెంట్ ఇచ్చేలా సీఎంతో మాట్లాడి ఒప్పించాల‌ని మంత్రిని వారు కోరారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల‌ను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారిస్తాన‌ని మంత్రి హామీనిచ్చారు.

మంత్రి ద‌యాక‌ర్‌రావును క‌లిసిన వారిలో టీజీవో, టీఎన్జీవో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్స్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, కోలా రాజేష్ కుమార్, ట్రెసా జిల్లా అధ్యక్షులు జీ రాజకుమార్, రాష్ట్ర సహాధ్యక్షుడు రియాజుద్దీన్, టీజీవో, టీఎన్జీవో నాయకులు మాధవ రెడ్డి, సదానందం, మురళీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.