పాపాయిలకు స్పా


పసిపిల్లలకు స్నానం చేయించే ముందు ఒళ్లంతా నూనె పట్టించి మర్దన చేయడం, కాళ్లూ, చేతులు సాగదీయం, చాలా మందికి తెలిసిందే. ఈ రోజుల్లో పిల్లలకు అలా తక్కువసార్లు చేయించగలుగుతున్నాం. అయితే అలా రోజు చేసే అవకాశాన్ని బేబీ స్పా అందిస్తున్నది. హైడ్రోథెరపీ, ఆధునిక పద్ధతిలో మర్దన సేవ అందించడమే బేబీ స్పా ప్రత్యేకత. ఈ సేవల్ని స్వాతి కొల్లా అందుబాటులోకి తెచ్చారు. ఇళ్లల్లో పసిపిల్లకలు సాంప్రదాయబద్ధంగా స్నానం చేయిస్తారు.
నూనెలతో మర్దన చేయడం, నలుగు పెట్టడం, వేడీ నీళ్లు పోయడం, అదో పెద్ద పని. ప్రస్తుతం నగరాల్లో తక్కువనే చెప్పాలి. బేబీ స్పా మనదేశంలో మొదటి సారి పరిచయం చేసారు స్వాతికొల్లా. పదిహేను రోజుల నుంచి ఎనిమిది నెలల లోపు శిశువులకు మర్దనా, హైడ్రో థెరపీ ఇస్తారు. హైడ్రోథెరపీలో భాగంగా పసిపిల్లల్ని నీళ్లలో వదిలేస్తారు. పిల్లలు వాళ్లంతట వాళ్లే నీళ్లలో కాళ్లు చేతులు ఆడిస్తూ, ఈత నేర్చుకుంటారు. ఇలాంటి స్పాని పెట్టాలనే ఆలోచన ఎవరిదంటే లండన్‌కు ఎందిన లారా సెవెనన్‌ది. ఆమె అంతర్జాతీయస్థాయి ఈత కోచ్‌. దాదాపు యాభై రెండేళ్ల నుంచి అదే రంగంలో ఉన్నారామె.
చాలా దేశాల్లో ఆమె ఈత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈత నేర్పించడమే కాదు ఈరంగంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పసిపిల్లలకు కూడా హైడ్రో థెరపీ అందుబాటులో తేవాలని 2005లో ప్రపంచంలోనే తొలిసారి బేబీ స్పాకి శ్రీకారం చుట్టారు. బేబీ స్పాకి హక్కులు తీసుకున్నారు స్వాతి. ఈ స్పాలో హైడ్రో థెరపీకి ఉపయోగించే ఈత టబ్‌లను లారా భర్త ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. పిల్లలు ఈత సమయంలో ఉపయోగించే బబ్బీ ప్రత్యేకమైన ఫోమ్‌తో తయారు చేస్తారు. చిన్నారులు దాన్ని నోట్లో పెట్టుకున్నా ఏ సమస్యా ఉండదు. నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి. పిల్లల తల తడవదు కాబట్టి జలుబు చేస్తుందనే భయం ఉండదు. నిపుణుల సమక్షంలో పాపాయికి మర్దన చేస్తారు. ఇందుకు ద్రాక్ష గింజల నూనె ఉపయోగిస్తారు. ఈ స్పాలు ఇప్పటి వరకు లండన్‌, ఆస్ట్రేలియా, స్పెయిన్‌, సౌత్‌ ఆఫ్రికాలో ఉన్నాయి. ఇప్పుడు భారత్‌కి విస్తరించినట్లు చెప్పారు. ఇక్కడ ఈ సేవల్ని స్వాతికొల్లా నగరానికి తీసుకొచ్చారు. స్వాతికి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే లండన్‌కు వెళ్లినప్పుడు బేబీ స్పా అనే బోర్డు ఆశ్చర్యపోయి దాని గురించిన వివరాలు తెలుసుకున్నారు. హైడ్రోథెరపీ వల్ల కలిగే లాభాలు వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. లారాసెవెనన్‌ని కలిసి మనదేశంలోనూ ఈ సేవల్ని అందించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇంట్లోవాళ్లు తనను ప్రోత్సహించడంతో స్వాతికొల్లా లక్ష్మీ హ్యుందా§్‌ుకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తూనే ఈ సేవలు అందిస్తున్నారు.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/