జీహెచ్‌ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఈ రోజు ఉదయం బాధ్యలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు. మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌య‌ల‌క్ష్మికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నెల 11వ తేదీన మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/