క్రిస్‌గేల్‌ : 22 బంతుల్లో 84 పరుగులు

అబుదాబిలో టీ10 టోర్నీ

Chris Gayle
Chris Gayle

అబుదాబిలో జరుగుతున్న టీ10 టోర్నీలో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ పరుగుల సునామి సృష్టించాడు. . 22 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు.

12బంతుల్లోనే 50పరుగులు చేసి గతంలో మహ్మద్‌ షేజాద్‌ పేరిట ఉన్న రికార్డును సమంచేశాడు. అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ ధాటికి మరాఠా అరేబియన్స్‌ బౌలర్లు చతికిలపడిపో యారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మరాఠా అరేబి యన్స్‌ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 97పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గేల్‌ సుడిగాలి సునామీ సృష్టించడంతో అబుదాబి 5.3 ఓవర్లలోనే విజయం సాధించింది.