కువైట్ లో తెలుగు మహిళను గదిలో బంధించి చిత్రహింసాలు ..

జీవనోపాధికోసం కువైట్ వెళ్లిన ఓ పేద మహిళను ఓ గదిలో బందించి చిత్రహింసలు పెడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళ(26) ఈనెల 24న కువైట్ వెళ్ళింది. చెంగల్‌ రాజు అనే ఏజెంట్‌ ఆమె గల్ఫ్‌ చేరేందుకు సహకరించాడు. అక్కడికెళ్లాక ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. అక్కడ బాగోలేకపోవడంతో ఇల్లు మార్చమని ఆమె సదరు ఏజెంట్ ను కోరింది. ఏజెంట్‌ చెంగల్‌రాజు, అతడి మిత్రుడు బావాజీ ఆమెపై కన్నేసి , అక్కడ ఓ గదిలో బంధించారు. తమ కోరిక తీరిస్తేనే ఇంకో ఇంట్లో పనికి కుదురుస్తామని హింసించడం మొదలుపెట్టారు.

నాలుగు రోజులుగా ఆమెకు తిండి కూడా పెట్టకుండా నీళ్లు మాత్రమే ఇస్తున్నారని బాధితురాలు తన భారతకు ఫోన్ చేసి విలపించింది. తిరుపతిలోని తన భర్తకు వీడియో పంపింది. తనను ఎలాగైనా తిరుపతికి తీసుకొచ్చేయమని వేడుకుంది. ఈ విషయమై బాధితురాలి భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.