కరోనా తో ఆ రిటైర్డ్ హెచ్ యం మృతి

ఆనందయ్య మందుకు అప్పట్లో క్రేజ్ తీసుకొచ్చింది ఈయనే…

That retired HM died with Corona
That ..Retired Head Master Kotaiah died with Corona

కృష్ణ పట్నం ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కోలుకుంటున్నట్లుగా చెప్పిన రిటైర్డ్ హెచ్ యం కోటయ్య మృతి చెందారు. కరోనాతో గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఇదిలావుండగా , కొద్ది రోజుల కిందట ఆనందయ్య మందుకు క్రేజీ తీసుకొచ్చింది ఈయనే. తనకు మందు బాగా పనిచేసిందని తెలియజేశారు.ఆయా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆయన ఆరోగ్యం క్షీణించడం.. ఇవాళ ఆయన మృతి చెందడంతో ఆనందయ్య మందుపై కాస్త సందేహాలు వస్తున్నాయి.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆనందయ్య మందుతో కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని ప్రచారం జరిగింది. అయితే, నిన్న కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ చనిపోవడంతో ఆనందయ్య మందుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా , ఆనందయ్య పంపిణీ చేసిన ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం పూర్తి చేసింది. ఆయుష్ కమిషనర్ రాములు అక్కడ పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు. ల్యాబ్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/