భరత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన కారు

Road accident at bharathnagar
Road accident at bharat nagar

హైదరాబాద్‌: నగరంలోని భరత్‌ నగర్‌ ఫ్లైఓవర్‌పై గత రాత్రి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారు పైనుంచి కిందపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/