ఇమ్రాన్ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం.. 90 రోజుల్లోనే ఎన్నికలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ పాకిస్తాన్ రాష్ట్ర‌ప‌తి అరిఫ్ అల్వీ నిర్ణ‌యం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేయాలంటూ ప్ర‌ధాని ఇమ్రాన్ సిఫార్సు చేసిన కేవ‌లం 30 నిమిషాల్లోనే రాష్ట్ర‌ప‌తి ర‌ద్దు చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇక‌.. 90 రోజుల్లో పాకిస్తాన్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాజ్యాంగంలోని 224 ఆర్టిక‌ల్ ప్ర‌కారం ప్ర‌ధానిగా ఇమ్రాన్ త‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తార‌ని మంత్రి ఫ‌వాద్ చౌధురి ప్ర‌క‌టించారు. అయితే కేబినెట్ మాత్రం ర‌ద్దైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లో ఆదివారం ప్ర‌తిప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీక‌ర్ ఖాసీం ఖాన్ సూరీ వ్య‌తిరేకించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. అయితే స్పీక‌ర్ అస‌ద్ ఖైస‌ర్ పైన కూడా ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాసాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డంతో డిప్యూటీ స్పీక‌ర్ స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించ‌డం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో మాత్రం స‌భ‌లో ప్ర‌ధాని ఇమ్రాన్ లేరు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/