మ్యాథ్స్‌లో ఫార్మూలాలతో మార్కులు ఖాయం

కెరీర్‌ గైడెన్స్‌

Mathematics
Mathematics

తరతరాల సామాజిక అభివృద్ధిలో గణితం ప్రధాన పాత్ర పోషి స్తుంది. ఇంజినీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీల ఆవిష్కరణ లన్నింటిలో దీని ప్రమేయం ఉంటుంది. అసలు నిత్య జీవితంలో లెక్కలతో సంబంధం లేకుండా మనకు ఏ రోజూ గడవదు. దీనిపై ఆసక్తి ఉన్నవారికి ఇదో ఆట లాంటిది. కానీ చాలా మంది విద్యార్థులకు మాత్రం ఒక బూచి. దాదాపుగా 60శాతానికిపైగా విద్యార్థులు దీనికి భయపడుతుంటారని అంచనా.

ఒక్కోదానికి ఒక్కోటి:

మాథ్య్‌ అంటేనే ఫార్ములాలు, థియరీలు, మెథడ్స్‌. సన్నద్ధమయ్యే సమయంలోనే వీటన్నింటికీ షార్ట్‌ నోట్స్‌ తయారుచేసుకొని ఉంచు కోవాలి. వేటికవే వేర్వేరుగా చేసుకొని ఉంచుకోవాలి. ముఖ్యంగా వెయిటేజీ ఆధారంగా వాటిని సిద్ధం చేసు కోవాలి. అవసరమైనప్పుడు, సందేహం వచ్చినప్పుడు, గుర్తుకు రానప్పుడు సులువుగా తీసి చూసుకోవడానికి వీలుగాతయారుచేసుకోవాలి.

ప్రాథమికాంశాలూ ముఖ్యమే:

గణితం సన్నద్ధత అనగానే చాప్టర్ల వారీగా సమస్య లను తీసుకోవడం, సాధించేయడం చూస్తుం టార. ఈ సబ్జెక్టులో ప్రాథ మికాంశాలు, కాన్సెప్టులకే ప్రాధా న్యం. ముందు వీటిని బాగా నేర్చుకోవాలి. పట్టుసాధించాలి. ఇవి సమస్యలను సాధించడానికి అవసరమైన టెక్నిక్‌ను ఉపయోగించడంపై అవగాహన కల్పించడంతోపాటు సబ్జెక్టును అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడతాయి. ఇవి నేర్చుకున్న తర్వాతే లెక్కల వైపు వెళ్లాలి.

చదవడం కాదు..సాధించాలి!

గణితం అంటేనే మొత్తం సూత్రాలతో ఉంటుంది. దీనిలో చదివి, గుర్తుంచుకునే అంశాలు తక్కువ. సమయం సరిపోవడం లేదనో, ఇది వరకే పట్టు సాధించి నవే అనో కొం దరు స్టెప్పుల వారిగా చదువు తుంటారు. ఇది మంది పద్ధతి కాదు. వచ్చినవే అయినా వాటిని స్టెప్పుల వారీగా పేపర్‌పై సాధించాల్సిందే. అలా పూర్తి చేస్తేనే వచ్చినట్లు, సరిగా సిద్ధమై నట్లు. సూత్రాల సాధనకూ ఇదే పద్ధతిని అనుసరించాలి.
పాత పేపర్లు..మాదిరి ప్రశ్నపత్రాలు: గతంలో జరిగిన పరీక్షల పేపర్లు, మాదిరి ప్రశ్నపత్రాలు మానసికంగా విద్యార్థిని పరీక్ష లకు సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయి.

ఎన్ని ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఆత్మవిశ్వా సం వస్తుంది. దీన్ని ఎక్కువ వెయిటేజీ ఉన్న అధ్యాయాల వారీగా చేయడం మంచిది. ఆ అధ్యాయంలో కాన్సెప్టులు క్షుణ్ణంగా వచ్చాయను కున్న తర్వాతే దానికి సంబంధించిన ప్రశ్నలను వివిధ ప్రశ్నపత్రాల్లో నుంచి తీసుకుని, సాధన చేయాలి. దీనివల్ల ప్రశ్నలు అడిగే తీరుపైనే కాకుండా ఒకే అంశంపై పూర్తి అవ గాహన కలుగుతుంది.

ఏ రోజువి ఆరోజే..!

సులువైన వాటికీ, కష్ట మైన వాటన్నింటికీ ఒకే సారి సిద్ధం కావద్దు అది ఒత్తిడితో పాటు అనాసక్తికీ దారితీస్తుంది. ఒకసులువైన, ఆపై ఒక కష్టమైన కాన్సెప్టును ప్రయత్నిస్తూ వెళ్లాలి. అలాగే పరీక్షల ముందు తక్కువ సమయం లోనే అన్ని అధ్యాయాలనూ పూర్తిచేయాల నే తాపత్రయమూ వద్దు నిజానికి ఒక థియరీ సబ్జెక్టుతో పాటుగా గణితాన్నీ చదివేలా ప్లాన్‌ చేసుకుంటే ఇంకా మం చిది. రోజు చివర్లో ఆ రోజు సిద్ధమైన కాన్సెప్టులను పునశ్చరణ చేయాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/