ఉత్తరకొరియా ప్రజలకు కిమ్‌ ఆదేశం

తీవ్ర ఆహారకొరత… పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలంటూ కిమ్ ఆదేశాలు

Kim Jong Un
Kim Jong Un

ప్యాంగాంగ్‌: ఉత్తరకొరియాలో ఆహార కొరత తీవ్రమైన నేపథ్యంలో, ప్రజలు తమ పెంపుడు కుక్కలను ప్రజలకు అప్పగించాల్సిందిగా కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశించారు. ఎవరైనా గానీ పెంపుడు కుక్కను కలిగివుండడం జాతీయ చట్టానికి వ్యతిరేకం అని హుకుం జారీ చేశారు. అంతేకాదు, పెంపుడు కుక్కను కలిగివుండడం కళంకిత బూర్జువా విధానానికి ప్రతీక అని కిమ్ సూత్రీకరించారు. కిమ్ ఆదేశాలు ఇచ్చిందే తరువాయి, అధికారులు పెంపుడు కుక్కలు ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిని పట్టుకునే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ శునకాలను ప్రభుత్వం నిర్వహించే జూలకు గానీ, కుక్కమాంసం వంటకాలు విక్రయించే రెస్టారెంట్లకు గానీ తరలించనున్నారు. కొరియాలో కుక్కమాంసం తినడం ఎప్పట్నించో ఉంది. అయితే, కుక్కమాంసం తినే అలవాటు దక్షిణ కొరియాలో క్రమంగా తగ్గిపోతుండగా, కిమ్ మాత్రం ఆహార కొరత నేపథ్యంలో పెంపుడు కుక్కలపై పడ్డారని అతడి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/