గాంధీలో ‘కరోనా’ వార్డును తీసేయాలి

ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్ల డిమాండ్‌

Coronavirus isolation ward in gandhi hospital
Coronavirus isolation ward in gandhi hospital

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డును తొలగించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై వారు గురువారం గాంధీ సూపరింటెండెంట్‌ను కలవనున్నారు. గాంధీ ఆసుపత్రికి ఓపీ కి ఇతర రోగులు వందల సంఖ్యలో వస్తుంటారని, వారు కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారని జూనియర్‌ డాక్టర్లు అంటున్నారు. ఓపీ కి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతోందని చెప్పారు. ప్రతి రోజు దాదాపు 2000 మంది ఓపీ పేషెంట్లు వచ్చేవారని, ప్రస్తుతం కేవలం 500 మంది మాత్రమే వస్తున్నారని అంటున్నారు. కరోనా వార్డును గాంధీలో ఉంచొద్దని వారు సూపరింటెండెంట్‌ను కోరనున్నారు. అయితే గాంధీలో ఉన్న కరోనా వార్డును నగర శివారు ప్రాంతానికి తరలించాలని కూడా వారు కోరుతున్నట్లు తెలుస్తోంది.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/