ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి

లక్ష్మీబాయి జయంతి పురస్కరించుకుని

Jhansi Lakshmibai
Jhansi Lakshmibai

ఆమె ఓ గొప్ప స్వాతంత్య్ర సమరయోధురాలు. శత్రుసైనికులకు ఎదురొడ్డి వెళ్లిన యోధురాలు. యుద్ధ యోధురాలిగా దుష్ట దౌర్జన్య, దురాగత, ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడిన వీర నారీమణి.

ఆమె అబల కాదు సబల అని నిరూపించిన అద్భుత శక్తియుక్తులు కలిగిన వీరనారీమణి. కోట్లాదిమంది భారత జనుల గుండెల్లో ప్రేరణజ్వాలలు ప్రసరింపజేసిన ఒక దివ్వజ్యోతి.

కొవొత్తిలాతాను కరిగిపోయన్నాకుడ తన మీద అధారపడిన ప్రజల మనసుల్లో జ్యోతులు ప్రసరింపజేసిన ఓ గొప్ప వజ్రపుతునక. నేటి తరం మహిళలకు ఓ గొప్ప రోల్‌మోడల్‌.

1928 నవంబరు 19న మహారాష్ట్రలోని వారణాసి పట్టణంలోని సతరాలో మోరోసంత్‌తాంబె, భగీరథీబాయి ఆదర్శదంపతులు ఇంట భారతమాత ముద్దుబిడ్డగా జన్మించింది.

ఆమె అసలుపేరు మణికర్ణిక. తండ్రి ప్రేమగా మను అని పిలిచుకొనేవారు. మణికర్ణిక 4సం. వయస్సులో తల్లి చనిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో వీరి దూరపు బంధువు వీరిద్దరికి ఆ శ్రమమిచ్చి ఆదుకున్నారు.

చిన్నతనంనుంచి రకరకాల విద్యలమీద ఆశక్తి కనబరిచేది. దాంతో తండ్రి కత్తి సాము, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం లాంటి విద్యలన్నింటిని నేర్పించాడు.

ఆమెకు 13 ఏళ్లకే ఝూన్సీ పట్టణానికి చెందిన, గంగధరరావు నెవల్కశతో 1942లో వివాహం జరిగింది. తరువాత ఝాన్సీలక్ష్మిబాయిగా మారిపోయింది.

వీరికి కుమారుడు పుట్టి చనిపోవడంతో దామోదరరావును దత్తత తీసుకున్నారు.

కొద్దిరోజులకే గంగాధరరావు చనిపోయారు.

దీంతో లక్ష్మిబాయి బాధల్ని దిగమింగు కొని విలువిద్యాల్లో మరింత ప్రావీణ్యం సంపాదించి ఆ విద్యాలన్ని తన సన్నిహితు లకినేర్పించి పటిష్టమైన స్త్రీ, పురుష దళల్ని తయారు చేసింది.

కొడుకు రాజవ్వాలని కోర్టులో దావావేసింది.

కాని కోర్టు కేసుకొట్టివేసింది. లక్ష్మి బాయి కోర్టుకు వెళ్లిందనే కక్షతో బ్రిటిష్‌వారు ఆమె ఆస్తులన్నీ స్వాధీన పరచుకున్నారు. అంతే కాకుండా ఆమెను ఝాన్సీ విడిచివెళ్లమని ఆదేశాలు జారీచేశారు.

ఆమె తన ప్రజలకోసం భారతభూమి కోసం బ్రిటీష్‌ వారి సుంకలాల నుంచి భారతమాతను రక్షించడంకోసం ఝాన్సీని విడిచివెళ్లేదీలేదని వారితో యుద్ధా నికి సిద్ధపడింది.

ఆమె తన బలగాలను చుట్టు ఏర్పచుకొని బిట్రిష్‌వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది.

ఈ వీరనారికి సహాయంగా తాంతొమతో 20000ల మంది సైన్యంతో వచ్చి వచ్చి యుద్ధానికి తలపడ్డాడు. కాని బ్రిటిష్‌వారి సైన్యంతో వయ్యి యుద్దానికి తలపడ్డాడు.

కాని బ్రిటిష్ సైన్యం ముందు లక్ష్మీ బాయి బలగాలు బలహీనమవ్వడంతో నగరాన్ని చేజిక్కించుకున్నారు.

బ్రిటిష్‌వారు కోటగడలను బద్దలుకొట్టి నగరాన్ని చేజిక్కించుకున్నారు.

కాని రాణిఝాన్సీ దత్తపుత్రుణ్ణి వీపునకు కట్టుకొని గుర్రపుస్వారీ చేస్తూ గ్వాలియర్‌ చేరుకొని అక్కడ అపార చండిలా గ్వాలియర్‌ మహారాజుతో యుద్ధం ఏసి గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకొంది.

ఈ సంతోషంలో వుంగానే మళ్లీ బ్రిటీష్‌ సేలు వచ్చి గ్వాలియర్‌ను ముట్టడించారు. లక్ష్మీబాయి వారితో కాళీమాతలా తలపడి యుద్ధం చేసింది.

కాని 17, జూన్‌ 1858న యుద్ధంలో వీరమరణం పొందింది. ఇలా అతి చిన్న వయసు లో తన బుద్ధికాశలతతో వీరసాహసంతో ఆంగ్లేయుల పాలిట సింహస్వప్పమై జాతికి వన్నెతెచ్చింది.

భారతదేశ రక్షణకోసం తన జీవితాని బలిదానం చేసి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన పవిత్రమూర్తి భారతరత్నం ఝాన్సీరాణి లక్ష్యీబాయి.

  • పింగళి భాగ్యలక్ష్మి,

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/