చలి నుండి రక్షణకు

To protect against winter

శీతాకాలంలో చాలు శరీరం మానసికంగా, శారీరకంగా తీవ్రంగా ప్రభావితమవుతుంది. సరైన సంరక్షణ లేకపోతే చర్మం, శరోజాలు, గోళ్లు అనారోగ్యానికి గురవుతాయి. ఫలితంగా ముఖంలో వయసు ఛాయలు కనిపిస్తాయి. చలికాలంలో వెచ్చటి సూర్యకిరణాలు మనసుకు ఆనందంగా ఉంటాయి. అలాగని సూర్యరశ్మి నేరుగా చర్మానికి తాకకుండా జాగ్రత్తపడాలి. లేదంటే చర్మంపై ఈ కిరణాల ప్రభావంపడి చర్మం పొడిబారినట్లుగా మారిపోతుంది. నల్లని మచ్చలు ఏర్పడతాయి.

సన్‌స్క్రీన్‌లోషన్‌ వేసవిలో మాత్రమే కాదు చలికాలంలోనూ అవసరమే. బయటికి వెళ్లినపుడు ముఖానికి, చర్మానికి రాసుకోవడం మంచిది. ఇది సూర్యకిరణాల ప్రభావం పడుండా చర్మాన్ని కాపాడుతుంది. ఎండ తీవ్రతతో సంబంధం లేకుండా రాసుకోవాలి. ఒత్తిడి మనల్ని ఎంతగా చిత్తు చేస్తుందో తెలియని విషయం కాదు. దీని నుంచి వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చర్మం కాంతిహీనంగా మారుతుంది.

యుక్తవయసులోనే వయసు పైబడినట్లు కనిపిస్తారు. ఒత్తిడికి కారణాలను తెలుసుకుని కౌన్సిలింగ్‌ తీసుకోవడం, స్నేహితులతో మాట్లాడటం, ఆత్మీయులతో సమస్యలను చర్చించడం, పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటి అభిరుచులను పెంపొందిం చుకోవడం చేయాలి. కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడిపితే ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.

మంచు, కాలుష్యం కలగసిన స్మాగ్‌ చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ కాలుష్యం కారణంగా చర్మం ముడతలు పడిపోవడం, జుట్టు పొడిబారడం, ముఖంపై వృద్ధాప్యఛాయలు కనిపించడం, పిగ్మెంటేషన్‌కు గురికావడం వంటివి ఉంటాయి. దీన్నుంచి రక్షించుకోవాలంటే చర్మకణాల్లోకి మురికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఇందుకు నాణ్యమైన క్లెన్సింగ్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తే మంచిది.శీతాకాలం జీవక్రియల వేగం తక్కువగా ఉంటుంది. దాంతో ఒకలాంటి నైరాశ్యం ఆవరిస్తుంది. అందుకే శరీరాన్ని చురుగ్గా ఉంచి, నిరోధక

శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా తాజా పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఈ కాలంలో కలిగే అలర్జీలకు దూరంగా ఉంచుతాయి.

ఎండవల్ల దుష్ప్రభావాలు మనపై పడకుండా చర్మాన్ని కాపాడతాయి. చర్మం పొడి బారకుండా చేసే శక్తి తాజా పండ్లకు ఉంటుంది. రోజు ఆహారంలో మూడు రకాల పండ్లు ఉండేలా చూసు కుంటే మంచిది. చలి కాలం నీళ్లు ఎక్కువగా తాగ లేక పోతాము. అయినా సరే మంచినీళ్లు తాగాల్సిందే.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/