నేడు మండలి రద్దు పై ప్రధాన చర్చ

నేటితో తేలిపోనున్న మండలి భవితవ్యం

cm jagan
cm jagan

అమరావతి: ఈరోజు ఏపి సిఎం జగన్‌ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో శాసన మండలిని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై ప్రధానంగా చర్చ సాగనుండగా, జగన్ మాత్రం మండలి రద్దువైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. మండలిని రద్దు చేయాలన్న బిల్లుపై క్యాబినెట్ ఆమోదం తరువాత, ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీలో దీనిపై ప్రత్యేక చర్చను జరిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని ఇప్పటికే టిడిపి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షం లేకుండానే మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది. కాగా, ఆశించిన స్థాయిలో టిడిపి నుంచి ఎమ్మెల్సీల చేరికలు ఉంటే, మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవచ్చని ఓ మంత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే, మండలి రద్దుకే మొగ్గు చూపుతున్నట్టు జగన్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/