సీఎం జగన్‌ రాజీనామా చేయాలి

అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి

narayana
narayana

రాజమండ్రి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి నారయణ డిమాండ్‌ చేశారు. రాజధాని మార్పుపై ఈ రోజు ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన ఆయన ముఖ్యమంత్రి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడినట్లైతే ఆయన చర్యలు తీసుకొండి అన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ భార్యభర్తల సంబందం లాంటిదని వీడదీయకూడదు నారయణ అన్నారు. ఆంధ్రప్రేదేశ్‌ ప్రభుత్వం అంటే నవ్వుల పాయిందని విమర్శించారు. చంద్రబాబుపై కక్షతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికదాని హితవు పలికారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని మూడుముక్కలాడుతున్నాడని దుయ్యబట్టారు. విశాఖ పట్టణంలో కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్సాఆర్‌ భూమి దొంగలు ఉన్నారని నారయణ ఆరోపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/