అమెజాన్ ప్రైమ్ లో ‘ఆచార్య’…

చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య కు సంబదించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధర కు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన కొన్ని వారాలకు ‘ఆచార్య’ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుందని అర్ధమవుతుంది. ప్రస్తుతం సినీ ప్రేమికులంతా ఓటిటికి బాగా అలవాటుపడ్డారు. కరోనా టైం లో థియేటర్స్ మూతపడడం కొత్త సినిమాలన్నీ ఓటిటిలో రిలీజ్ కావడం తో చాలామంది ఓటిటిలో సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో అగ్ర హీరోల చిత్రాలకు పోటీపడి మరి ఓటిటి సంస్థలు భారీ ధర పెట్టి రైట్స్ కొనుగోలు చేస్తున్నాయి.

ఇక ఆచార్య విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం తో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 200, ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.