రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే: కాంగ్రెస్2014 నుంచి ప్ర‌తి పక్ష నేతగా ఉన్న ఆజాద్

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మల్లికార్జున ఖర్గే పేరును కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపాదించింది. ప్ర‌స్తుతం ఆ హోదాలో ఉన్న గులాంనబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 15తో ‌ ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త నేతగా మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్ర‌తిపాదించింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంక‌య్య నాయుడికి కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది.

మల్లికార్జున ఖర్గే గతంలో లోక్ సభలో ప్ర‌తి పక్ష నాయకుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఆజాద్ 2009 నుంచి కొనసాగుతున్నారు. రాజ్యసభలో ఆజాద్ 2014 నుంచి ప్ర‌తి పక్ష నేతగా ఉన్నారు.