ఉత్త‌రాఖండ్‌లో ఆక‌స్మిక వ‌ర‌ద‌- 150 మంది గ‌ల్లంతు

హ‌రిద్వార్‌, రిషికేష్‌ల‌తోపాటు యూపీలో గంగా ప‌రివాహ‌క ప్రాంతాల్లో హైఅలెర్ట్!

Nandadevi Glacier breaks and falls into Dhauli Ganga
Nandadevi Glacier breaks and falls into Dhauli Ganga

Uttarakhand: ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలి జిల్లాలో నందాదేవి గ్లేసియ‌ర్ విరిగి ధౌలిగంగా న‌దిలో ప‌డ‌టంతో ఆక‌స్మిక వ‌ర‌ద పోటెత్తింది. దీని కార‌ణంగా ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌, రిషికేష్‌ల‌తోపాటు యూపీలో గంగా ప‌రివాహ‌క ప్రాంతాల‌లో హైఅలెర్ట్ ప్ర‌క‌టించారు.

స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి వంద‌లాది మంది ఐటీబీపీ పోలీసు సిబ్బంది వెంట‌నే ఆ ప్రాంతానికి వెళ్లిన‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అటు 200 మంది ఎన్డీఆర్ఎఫ్  సిబ్బంది కూడా ఆ ప్రాంతంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్‌తో ఇప్ప‌టికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.