ఇంగ్లాండ్ 578 పరుగుల భారీ స్కోరు

భారత్ -ఇంగ్లాండ్ నాలుగు టెస్టుల సిరీస్

England score 578 runs
England score 578 runs

చెన్నై వేదికగా భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 578 పరుగులు స్కోరు సాధించింది.

మూడో రోజు తొలి సెషన్ పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ తొలి లక్ష్యం ఫాలౌన్ అధిగమించడమే అవుతుంది. ఫాలౌన్ ఆడకుండా ఉండాలంటే భారత్ 378 పరుగులు చేయాల్సి ఉంది.

ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ లో రూట్ 218 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ 82, ఓలీ పోప్ 37, జోన్ బట్లర్ 30, డామ్ బెస్ 34 పరుగులూ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ లు మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.