ఆర్థిక ప్యాకేజీపై నేడు మరిన్ని వివరాలు

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మీడియా సమావేశం..వ్యవసాయ రంగంపై వివరాలు తెలిపే అవకాశం

Finance Minister Nirmala Sitharaman
Finance Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన పలు వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న మీడియా సమావేశంలో వివరించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్యాకేజీ లబ్ధిదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంకాలం ఆమె వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్యాకేజీ వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ప్రకటించబోతున్నామని నిన్ననిర్మలా సీతారామన్ తెలిపిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/