అంధుల అక్షర శిల్పి ‘లూయిస్‌ బ్రెయిలీ

నేడు లూయిస్‌ బ్రెయిలీ జయంతి

louis braille
louis braille

ఫ్రెంచ్‌ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త, ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ. మోనిక్‌ బారస్‌ బ్రెయిలీ, సైమర్‌ రెనా బ్రెయిలీ దంపతులకు లూయిస్‌ బ్రెయిలీ 1809 సంవత్సరం జనవరి 4న పారిస్‌ దగ్గరలోని క్రూవే గ్రామంలో జన్మించాడు. అమావాస్య చీకటిలో అంధకార జీవితాన్ని గడు పుతున్న అంధుల పాలిట పున్నమి వెన్నెల ప్రధాత లూయీ బ్రెయిలీ. అంధాకర జీవితంలోని బాధను అనుభవించిన అంధుడాయన. అందువలననే అంధులను అక్షర జ్ఞాన సంప న్నులుగా తయారుచేసిన లిపిని ఆయన ప్రపంచానికి అందిం చారు. అనేక సంవత్సరాల తీవ్ర కృషి ఫలితంగా రూపొందిం చిన లిపి లూయిస్‌ బ్రెయిలీ పేరు మీద ”బ్రెయిలీ లిపిగా ఖ్యాతి పొంది నేడు ప్రపంచంలోని అంధులందరికీ జ్ఞాన సంపదను పంచిపెడుతూ అంధులలోని మేధా సంపత్తును వెలికితీస్తూ వారిని మహామేధావులుగా సమాజానికి అంది స్తున్నది. అందుకే ఆయన జన్మదినం అయిన జనవరి 4వ తేదీని ప్రపంచంలోని అంధులంతా ఎంతో పర్వదినంగా పాటిస్తూ అంధుల అక్షర ప్రధాత లూయీస్‌బ్రెయిలీని మనసార స్మరించుకుంటున్నారు. దృష్టిలోపం వున్నవారికి, అంధులకు ఉపయోగపడే విధంగా 6 అక్షరాలతోనే చదవడానికి, రాయడా నికి వీలుగా ఒక అక్షర మాలను రూపొందించాడు బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండుకళ్లను కోల్పోయి తన 4వ ఏటా పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. మనిషికి ముఖ్యమైనవి కళ్ళు. అందుకే ”సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలన్నారు. జ్ఞానికి నిజమైన వాకిండ్లు కళ్లు. అంధ జీవితపు కష్టాలను స్వయంగా అనుభవించిన లూయిస్‌ బ్రెయిలీ పుట్టు అంధుడు కాదు. ఆయన అందరిలానే పుట్టాడు. మూడేళ్ల వర కు బాగానే వున్నాడు. తన తండ్రి గుర్రం జీన్లు తయారుచేస్తు న్న దగ్గరకు వెళ్లి ఆడుకుంటుండేవాడు. అక్కడ వున్న చెప్పులు కుట్టే సాధనాన్ని తీసుకుని ఆడుతుండగా కంటికి తగిలింది. కంటి నుంచి రక్తం ధారగా కారిపోతుండగా, చికిత్స ఆలస్యమై బ్రెయిలీ కన్ను దెబ్బతిన్నది. క్రమేణా రెండో కన్నుకు కూడా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించి 4వ ఏటా పూర్తిగా అంధుడయ్యాడు. ఎప్పుడూ ఏదో చేస్తూ అన్వే షణే ప్రవృత్తిగా బాల్యాన్ని ప్రారంభించిన ఆయన కంటి చూపు కోల్పోయినంత మాత్రాన అధైర్యపడలేదు. తన అక్క కేథరిన్‌తోపాటు పాఠశాలకు వెళ్లేందుకు లూయీకి కూడా చదువు మీద ఆసక్తి కలిగింది. ఇంటికి వచ్చి ఆ పాఠాలను చెప్తుండేవాడు. తన ఆలోచనలకు పదును పెట్టసాగెను. అయితే అంధత్వంలో నుంచి పుట్టుకొస్తున్న చిన్నపాటి ఆలోచనలు ఆచరణలో రూపుదిద్దుకోవడం అసాధ్యం కావడంతో నిరుత్సాహ పడసాగాడు. అతని నిరుత్సాహాన్ని మరియు శ్రద్ధాసక్తులను గమనించిన తండ్రి చిన్న మేకులను ఒక చెక్కపై అక్షరాలుగా చేసి లూయిస్‌ చేతులతో చదివించేవాడు. లూయిస్‌కు మంచి ధారణ, గ్రహణశక్తి వుండటం వన పాఠశాలలో ఉపాధ్యాయుల మన్ననలు పొందేవాడు. పదో ఏటా పారిస్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది బ్లైండ్‌లో స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు. 1784లో వాలంటైస్‌ హ్యూ స్థాపించిన అంధుల పాఠశాలకు చదువుకోవడానికి వెళ్లాడు. అంధులకు చూసే అవకాశం లేదు గనుక ఆ ప్రింటింగ్‌ విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి వుండాలని గ్రహించాడు. అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా వుండాలని భావించాడు. ఒక గీతగా కాకుండా చుక్కలు చుక్కలుగా వుంటే చదవడం తేలికని బ్రెయిల్‌ నిశ్చ యానికి వచ్చాడు. 1821లో ఆ పాఠశాలను ఫ్రెంచ్‌ మాజీ ఆర్మీ కెప్టెన్‌ చార్లెస్‌ బార్బియర్‌ సందర్శించాడు. ఆ సందర్భం గా తాను కనుగొన్న 12 గుర్తులతో రూపొందించిన రాత్రి చదు వు గురించి ప్రస్తావించాడు. అది నిజానికి సైనికులకు మాత్రమే తెలిసే రహస్య సంకేతాలను తమ వేళ్ల ద్వారా స్పృశించి తెలు సుకునే విద్య. తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపి ని తయారుచేశాడు చార్లెస్‌. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను 6 చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను, అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు. స్పర్శ ద్వారా అక్షరాలను గుర్తించడం బ్రెయిలీ లిపి ప్రత్యేకత. ఆచరణలో కూడా అతి తేలికైన ఈ పద్ధతిలోని విశిష్టతను ప్రపంచంలోని మేధావులు గుర్తిచడంతో 1852 జనవరి 4వ తేదీన ఫ్రాన్స్‌ ప్రభుత్వం బ్రెయిలీ జన్మదినోత్సవాన్ని జరుపుతూ బ్రెయిలీ లిపి గుర్తిం చింది. అప్పటినుంచి ఈలిపి ”బ్రెయిలీలిపిగా ప్రపంచవ్యాప్తం గా అమల్లోకి వచ్చింది.ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనస్సుల్లో, వారి ముని వేళ్ళల్లో చిరకాలం జీవిస్తుంటాడు బ్రెయిలీ.

  • నర్రా రాంబాబు,

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/