బిగ్ బాస్ 5 : 77 రోజులకు గాను ఆనీ మాస్టర్ కు రూ. 38,50,000 ఇచ్చారా..?

బిగ్ బాస్ 5 : 77 రోజులకు గాను ఆనీ మాస్టర్ కు రూ. 38,50,000 ఇచ్చారా..?

తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. 19 మంది సభ్యులతో మొదలైన సీజన్..ప్రస్తుతం 12 వ వారంలో కొనసాగుతుంది. హౌస్ లో ప్రస్తుతం హౌస్లో 8 మంది సభ్యులు కొనసాగుతున్నారు. మరో మూడు వారాలు మాత్రమే ఉండడం తో విన్నర్ ఎవరు అవుతారనేది ఆసక్తిగా మారింది. ఇక ప్రతి వారం హౌస్ నుండి ఒక సభ్యుడు బయటకు వెళ్తుంటారు. గత వారం ఆనీ మాస్టర్ బయటకు వెళ్ళింది. దాదాపు హౌస్ లో 77 రోజులు కొనసాగింది.

ఇప్పుడూ సోషల్ మీడియా లో ఆనీ మాస్ట‌ర్ 77 రోజులకు గాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే ఆసక్తి క‌రంగా మారింది. రెమ్యూనరేషన్ అన్నది సెలబ్రిటీ పాపులారిటీని బట్టి నిర్ణయిస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా రెమ్యూనరేషన్ ను బిగ్ బాస్ యాజమాన్యం అందిస్తారు. అలా ఆనీ మాస్టర్ కు వారానికి 3,50,000 ల అందించినట్లు తెలుస్తుంది. పదకొండు వారాల‌కు గాను మొత్తం 38,50,000 ల వ‌ర‌కు సంపాదించిందని సోష‌ల్ మీడియా టాక్. ఆనీమాస్టర్ కి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే అనేక డ్యాన్స్ షో లకు జడ్జీగా వ్య‌వ‌హ‌రించింది. కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం ఇంత పెద్ద మొత్తం ఇచ్చినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం హౌస్ లో బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్కులు నడుస్తున్నాయి. కెప్టెన్సీ టాస్క్ అంటే కంటెస్టెంట్స్ మధ్యలో కచ్చితంగా గొడవలు వస్తాయి. నిన్న కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయ్యాయి. ఈ సారి కెప్టెన్సీ టాస్కులను కొత్తగా ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటిసభ్యులందరికీ ‘నియంతమాటే శాసనం’ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మరి ఈ టాస్క్ లో ఎవరు విజేత అవుతారో..ఎవరు హౌస్ లో చివరి కెప్టెన్ అవుతారో చూడాలి.