జూన్‌ 4న ఎంపిటిసి, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు

telangana elections commission
telangana elections commission

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన ఎంపిటిసి, జడ్పీటిసి ఓట్ల లెక్కింపు తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్‌ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ఎంపిటిసి, జడ్పీటిసి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రతిపక్షాల విజ్ఞప్తితో ఈ నెల 27న జరగాల్సిన కౌంటింగ్‌ వాయిదా పడింది. సోమవారం నాడు పంచాయితీ రాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ వెలువడింది. దీంతో ఎంపిటిసి, జడ్పీటిసి సభ్యుల ప్రమాణస్వీకారం కంటే ముందే చైర్‌పర్సన్లను ఎన్నుకునే వెసులుబాటు కలిగింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/