జియోనా బతికే ఉన్నాడని అంత్యక్రియలు జరపని కుటుంబం
శరీరం వెచ్చగా ఉందని వెల్లడి

39 మంది భార్యలు ఉన్న జియోనా చానా ఆదివారం మరణించాడు.జియాన్‌ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు.
మిజోరంలోని బక్తావంగ్ గ్రామానికి చెందిన జియోన అనారోగ్యంతో మరణించినట్టు వైద్యులు కూడా ఆదివారం ధ్రువీకరించారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. జియోనా శరీరం వెచ్చగా మారడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆయన బతికే ఉన్నారని నమ్ముతున్నారు. ఆయన పల్స్ బీట్ కూడా మొదలైందని, అంత్యక్రియలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు. 39 మంది భార్యలు, 90 మందికిపైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా జియోనా చానా రికార్డు కెక్కాడు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/news/sports/