మహిళా సాధికారతను ఆచరణలోకి తీసుకొచ్చాం : సిఏం జగన్

స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ సొమ్ము జమ

Zero interest deposit to swayam sahaayaka samghaalu
Zero interest deposit to swayam sahaayaka samghaalu

Amaravati: కోవిడ్‌ కష్ట కాలంలో రాష్ట్రం ఆదాయం సరిగా లేకపోయినా ఇచ్చిన మాట కోసం అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ సొమ్ము రూ.1109 కోట్లును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

వర్చువల్‌ విధానంలో సిఏం పొదుపు సంఘాల మహిళలతో మాట్లాదారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, మహిళా సాధికారతను ఆచరణలోకి తీసుకురాగలిగామని అన్నారు. . పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ సొమ్ము వరుసగా రెండో ఏడాది అందజేస్తున్నామని చెప్పారు. రెండో ఏడాది డ్వాక్రా సంఘాలపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని ప్రకటించారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/