ఐపిఎల్‌లో ప్రదర్శనే పాండ్యా వరల్డ్‌కప్‌లో కూడా కొనసాగిస్తాడు

yuvraj singh, hardhik pandya
yuvraj singh, hardhik pandya

మే 30 నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు విజయాల్లో ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా కీలకపాత్ర పోషిస్తాడని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ చెప్పుకొచ్చాడు. ఐపిఎల్‌-12 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టును ఫైనల్‌కి చేర్చడంలో హార్దిక్‌ పాండ్యా 34 బంతుల్లో 91 పరుగులతో చెలరేగిఆడాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌ చాలు ఈ సీజన్‌లో పాండ్యా ఎంత కసిగా ఆడుతున్నాడో చెప్పడానికి. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 200పైగా స్ట్రైక్‌ రేట్‌తో 393 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు తీశాడు. ఐపిఎల్‌లో చేసిన ప్రదర్శననే పాండ్యా వరల్డ్‌కప్‌లో కూడా కొనసాగిస్తాడని యవరాజ్‌ అభిప్రాయపడ్డాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/