రిషబ్‌ పంత్‌ భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణం : యువరాజ్‌

YUVARAJ singh
YUVARAJ singh

యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణమని ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నారు. ఐపిఎల్‌లో రిషబ్‌ పంత్‌ ఢిల్లీ కాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ 27బంతుల్లో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే 21 ఏళ్ల వయసులోనే విదేశాల్లో రెండు సెంచరీలు నమోదు చేయడం అతని సూపర్‌ టాలెంట్‌కి నిదర్శనమని యువరాజ్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురింపించాడు. ఈసీజన్‌లో తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపై యువీ మాట్లాడుతూ ‘రోహిత్‌ శర్మ త్వరగా ఔటవ్వడం తమ అవకాశాల్ని దెబ్బతీసింది. డికాక్‌, పొలార్డ్‌లు తమకు లభించిన ఆరంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. సరైన భాగస్వామ్యాల్ని నెలకొల్పలేకపోవడంతో 215 పరుగుల భారీ స్కోరును చేధించడం తమకు కష్టమైపోయిందని అన్నాడు. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా ఆడిన కెప్టెన్‌ రోహిత్‌శర్మ (14) నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరిపోగా….అనంతరం వచ్చిన సూర్యకుమర్‌ యాదవ్‌ (2) నిరాశపరిచాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్‌ డికాక్‌ (27) కూడా ఔటవ్వడంతో ముంబై 45/3 కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్‌ ఆటగాళ్లు యువరాజ్‌, పొలార్డ్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ (53) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్థిక్‌ పాండ్యా (0) కూడా ఔటవ్వడంతో మ్యాచ్‌పై ముంబయి పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: