టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి రుచికరమైన వంటకాల మెనూ సిద్ధం ..

ఈసారి టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వచ్చే వారికీ రుచికరమైన వంటకాలు సిద్ధం చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటి , రెండు కాదు ఏకంగా 29 రకాల వంటకాలకు సంబదించిన మెనూ సిద్ధం చేసారు కేసీఆర్. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్‌మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా సిద్ధం చేస్తున్నారట.

ఆ రుచికరమైన మెనూ చూస్తే..

ధమ్‌ చికెన్‌ బిర్యానీ, మటన్‌ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్‌, బోటిఫ్రై, ఎగ్‌ మసాలా, రుమాల్‌ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్‌, వెజ్‌ బిర్యానీ, వైట్‌ రైస్‌, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్‌రైస్‌, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్‌, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్‌, వడియాలు, జిలేబీ, డబల్‌ కా మీఠా, ఐస్‌ క్రీం, గ్రీన్‌ సలాడ్‌, బటర్‌ రైస్‌, డ్రై ఫ్రూట్స్‌, కారా, బూంది, లడ్డూ, చాయ్‌ వంటివి అందివ్వబోతున్నారట.