పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేంత వరకూ ఆమరణ నిరాహార దీక్ష: షర్మిల

ysrtp-chief-ys-sharmila-diksha-ongoing-at-lotus-pond

హైదరాబాద్ః లోటస్ పాండ్ వద్ద షర్మిల దీక్ష కొనసాగుతోంది. కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పార్టీ నేతలు,కార్యకర్తలు రాకుండా మూడు వైపుల బారికేడ్లు పెట్టారు. అయితే ప్రభుత్వం తన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేంత వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని షర్మిల తేల్చి చెప్పారు. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న మధ్యాహ్నం నుంచి ఆమె ఆమరణ దీక్షను చేపట్టారు.

సిఎం కెసిఆర్కు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్గా పని చేస్తున్నారని ఆరోపించారు. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా భయపడబోమన్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా ఇంటి బయట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి తీసుకెళ్లారు. తన ఇంటి దగ్గర తాను దీక్ష చేపడితే ఇన్ని ఆంక్షలా? అంటూ ఈ సందర్భంగా షర్మిల మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించిన షర్మిల వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె తల్లి వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత దీక్ష శిబిరం వద్ద షర్మిలను కలిసి ఆమె మాట్లాడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/