ఈ సారి గెలుపు మాదే

y s jagan
y s jagan, ysrcp president


సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్‌ఆర్‌సిపి ఈసారి విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది. 2014 ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనా, ఈసారి మాత్రం గెలుపు సాధిస్తాం అని వైఎస్‌ఆర్‌సిపి పార్టీ అధ్యక్షడు జగన్‌ తెలిపారు. అయితే అభ్యర్థుల ప్రకటన మ్యానిఫెస్టో విడుదల విషయంలో మాత్రం టిడిపి కంటే వ్యూహాత్మకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఇప్పటికే ఖరారైన అభ్యర్థులను ప్రకటించకుండా.. అధికార పక్షంలో ఉన్న కొందరు బలమైన అభ్యర్థులు బయటకు వచ్చి వారికి వైఎస్‌ఆర్‌సిపిి టికెట్లు కేటాయిస్తే, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందగలమన్న ఆలోచనలో జగన్‌ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిఃhttps://www.vaartha.com/andhra-pradesh/