మంత్రి రోజా కు నిరసన సెగ..పార్టీని నమ్ముకుంటే అప్పుల పాలు చేశారు
భార్యతో కలిసి మంత్రి రోజా ముందు వైఎస్‌ఆర్‌సిపి నేత నిరసన

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి సర్కార్ పట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల స్థాయి నేతలు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు కూడా ఈ తరహా ఘటనే ఎదురైంది.
చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం నగరిలోని వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండ్రిగలో మంత్రి రోజా ముందే గ్రామ స్థాయి వైఎస్‌ఆర్‌సిపి నేత తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులను సొంత ఖర్చులతో చేస్తే తమకు ఇప్పటిదాకా బిల్లులే మంజూరు కాలేదని గ్రామ మాజీ సర్పంచ్ తన సతీమణితో కలిసి రోజా ముందు నిరసనకు దిగారు. వైఎస్‌ఆర్‌సిపిని నమ్ముకుని తాము అప్పుల్లో కూరుకుపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ నేత మంత్రి ఎదుటే నిరసనకు దిగారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/