వైస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

టెక్నలాజి అభివృద్ధి చెందిందని సంతోష పడాలో..సైబర్ నేరాలు పెరుగుతున్నాయనో ఆందోళన చెందాలో అర్థంకావడం లేదు. రోజు రోజుకు సైబర్ నేరాలు విపరీతమవుతున్నాయి. సినీ , బిజినెస్ , రాజకీయ ప్రముఖులనే కాదు సామాన్య ప్రజలను కూడా వదలడం లేదు. బ్యాక్ అకౌంట్స్ ను హ్యాక్ చేయడం తో పాటు వారి సోషల్ మీడియా ఖాతాలను సైతం హ్యాక్ చేస్తున్నారు.

తాజాగా ఏపీ అధికారపార్టీ వైస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసారు నేరగాళ్లు. వైస్సార్సీపీ ట్విట్టర్ ప్రొఫైల్ , అలాగే కవర్ ఫోటోను మార్చేశారు. అధికార పార్టీ వైస్సార్సీపీ కి ఎలాంటి సంబంధం లేని కృప కమ్యూనిటీ పోస్టులను రీట్వీట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదు. దీనిపై మరికాసేపట్లోనే స్పందించే అవకాశం ఉంది. కొద్దీ రోజుల క్రితం టీడీపీ అకౌంట్ ను కూడా ఇలాగే హ్యాక్ చేయడం జరిగింది.