వైఎస్‌ఆర్‌సిపి అంగట్లో టికెట్ల వేలం

ap cm Chandrababu
ap cm Chandrababu


అమరావతి: టిడిపిలో ఉన్న సంస్కృతి వైఎస్‌ఆర్‌సిపిలో లేదని ఏపి సియం ఆ పార్టీని విమర్శించారు. టిడిపిలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందని ఏపి సియం చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. అభ్యర్ధుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించటానికి వీల్లేదని ఆదేశించారు. కాని వైఎస్‌ఆర్‌సిపి టికెట్లను అంగట్లో పెట్టి వేలం నిర్వహిస్తుందని, వారికి విలువలు లేవని ఆయన అన్నారు. చింతలపూడిలో రూ.3 కోట్లు ఇస్తానంటే ఒకరికి..అంతకంటే ఎక్కు ఇస్తానంటే ఇంకొకరికి అంటూ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధుల్ని మారుస్తుందని విమర్శించారు. టిడిపిలో పనిచేసినవారిని గుర్తించి, సామాజిక న్యాయాన్ని అభ్యర్ధుల ఎంపికలో పాటిస్తున్నామని వెల్లడించారు. టికెట్‌ ఇవ్వలేకపోతున్నామని తాను చెప్తే అర్దం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్పూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని పేర్కోన్నారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అందరినీ గుర్తించి భవిష్యత్‌లో పదవులిస్తామని స్పష్టం చేశారు. కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/