రేపటి రాష్ట్ర బంద్‌కు వైస్సార్సీపీ సంఘీభావం
perni nani
అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌కు వైస్సార్సీపీ సంఘీభావం ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని మంత్రి పేర్ని నాని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదని పేర్ని నాని చెప్పారు. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలపనున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న జరగనున్న రాష్ట్ర బంద్‌కు టీడీపీ తన మద్దతు ప్రకటించింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్దమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు టీడీపీ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు.
తాజా తెలంగాణ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/