వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

y s jagan mohan reddy
y s jagan mohan reddy, ap cm


న్యూఢిల్లీ: ఏపిలోని ఏపి భవన్‌లో వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏపి సియం జగన్మోహన్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 17 నుంచి జరగనున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, రాష్ట్ర సమస్యలను సామరస్యంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి తరఫున ఎన్నికైన ఎంపీల్లో ఎక్కువ మంది కొత్త వారు కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ఏ విధంగా లేవనెత్తాలన్న అంశంపై సియం జగన్‌ దిశానిర్దేశం చేయనునానరు. లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డితో పాటు పార్టీ ఎంపిలంతా సమావేశానికి హాజరయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:  http:// https://www.vaartha.com/news/nri/