లోక్‌ సభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ : నేడు లోక్‌స‌భ‌లో కృష్ణాన‌ది జ‌లాల‌పై వివాదం చ‌ర్చ‌కు వ‌చ్చింది. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి అక్ర‌మ‌రీతిలో తెలంగాణ జెన్‌కో విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. శ్రీశైలాం జ‌లాశ‌యంలో నీటి స్థాయి మినీమ‌మ్ 854 ఫీట్లు ఎత్తు ఉండాల‌ని, కానీ 800 ఫీట్ల ఎత్తులో ఉన్న‌ప్పుడు తెలంగాణ జెన్‌కో విద్యుత్తు ఉత్ప‌త్తి చేస్తోందని ఆరోపించారు. ఆదేశాలు ఇచ్చినా విద్యుత్తు ఉత్ప‌త్తి జ‌రుగుతోందన్నారు.. దీని వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు నీటి క‌ష్టాలు వ‌స్తాయ‌న్నారు.

అన్‌టైమ్‌లీ జ‌న‌రేష‌న్ ఆపాల‌న్నారు. ఏపీ, చెన్నై ప్ర‌జ‌ల సంక్షేమం కోసం విద్యుత్తును ఆపాల‌న్నారు. ఈ ప్ర‌శ్న‌కు జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ ష‌కావ‌త్ బ‌దులిస్తూ.. జెన్‌కోను విద్యుత్తు ఆపాల‌ని కోరామ‌న్నారు. కానీ జెన్‌కో విద్యుత్తు ఉత్ప‌త్తి చేస్తోంద‌ని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాం. ఈ సమస్య పరిష్కారానికే గెజిట్ విడుదల చేశాం’’ అని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/