తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న టెన్షన్‌

ట్విట్టర్‌లో విజయసాయి రెడ్డి విమర్శలు

V. Vijayasai Reddy
V. Vijayasai Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎవరినో ఉద్దేశించి తన ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. ఆయన పేరును వ్యక్త పరచకుండానే మళ్లీ అవే ఏడుపులు అమరావతి, పోలవరం, మచిలీపట్నం పోర్టు, పిపిఏల సమీక్ష, కాంట్రాక్టర్ల బిల్లులు, నవయుగకు అన్యాయం. ఎంతసేపు తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనన్న టెన్షన్‌ తప్ప ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం గురించి, నాలుగు లక్షల ఉద్యోగాల గురించి ఒక్క మాటైన మాట్లాడే దమ్ములేదు అంటూ స్పందించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/