చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విసుర్లు

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా రాష్ట్రంలో సిఎం జగన్‌ తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణల నేపథ్యంలో చంద్రబాబుపై ఆయన ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ‘సిఎం జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణితిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే’ అంటూ ట్వీట్‌ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/