చంద్రబాబును ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి ?

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని వైఎస్‌ఆర్‌సిపి పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అడ్డమైన విషయాలపై జూమ్‌లో మాట్లాడే చంద్రబాబుకు… ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా ? అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/