సిఎం జగన్‌కు షాకిచ్చిన సీబీఐ కోర్టు

పిటిషన్ ను కొట్టివేసిన సీబీఐ కోర్టు

AP CM YS JAGAN
AP CM YS JAGAN

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌కు హైదరాబాదులోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. మినహాయింపు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మీ, రాజగోపాల్‌ ఈరోజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/