చంద్రబాబుపై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: రిజర్వేషన్ల అంశంపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డి తో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బిసి నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి” అంటూ చంద్రబాబుపై ట్విట్టర్‌ స్పందించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/