సుజనా చౌదరికి వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ కౌంటర్‌

Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి ఎంపీలు టచ్‌లో ఉన్నారంటూ బిజెపి ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో సంచలనం కలిగించాయి. తాజాగా ఈ వ్యవహారంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఘాటుగా స్పందించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు టచ్‌లో ఉన్నారని సుజనా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజాదరణ పెరుగుతోందన్నానరు. కాగా సీఎం వైఎస్‌ జగన్‌కి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరైనా మళ్లీ గెలిచే అవకాశం లేదని భావిస్తే పార్టీ మారాలనుకుంటారు. కానీ మా పార్టీ నాయకులకు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఎంపీలతో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కేంద్ర నాయకులను కలుస్తామని..రాష్ట్రానికి అవసరమైన పనులపై కలవడం సహజమేనన్నారు. ఆ రకంగా అందరం టచ్‌లోనే ఉంటామని..అయితే అది రాజకీయంగా కాదన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/