రైతుల పొట్ట కొట్టిన వ్యక్తి చంద్రబాబు

undavalli sridevi
undavalli sridevi

అమరావతి: మరోసారి రాజధానికి వెళ్లే ధైర్యంలేకే చంద్రబాబు నాయుడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని విజయవాడలో పెట్టుకున్నాడని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పై రాళ్లు ఎందుకు పడుతున్నాయని విమర్శించారు. రకరకాల విన్యాసాలతో రైతుల పొట్ట కొట్టిన వ్యక్తి చంద్రబాబని ఆమె విమర్శించారు. చంద్రాబాబు దళిత ద్రోహి అని దళితుల ఎస్సెన్డ్‌ భూములు లాక్కుని అన్యాయం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల్ని పక్కన ఏనాడు కూర్చోబెట్టుకొని చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌లో కొట్టేసింది బయటకు వస్తుందని, ఆయన త్వరలో జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. చంద్రబాబు పాలనలో అక్రమాల చిట్టా లిమ్కాబుక్‌ రికార్డులో ఎక్కుతుందని వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/